శవాలపై పేలాలు ఏరుకునే రాజకీయాలు చేయొద్దు: హరీశ్ రావు

  • దళిత రైతు నర్సింహులు మృతి దురదృష్టకరం
  • ఇది రాజకీయ ప్రేరేపిత హత్య
  • స్వలాభం కోసం అమాయకులను బలి చేయొద్దు
వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన దళిత రైతు నర్సింహులు ఆత్మహత్య దురదృష్టకరమని తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ రాజకీయ ప్రేరేపిత హత్య అని ఆయన ఆరోపించారు. మృతుడి భూమిని టీఆర్ఎస్ ప్రభుత్వం బలవంతంగా తీసుకుందనే ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే  విద్యుత్ సబ్ స్టేషన్ కోసం భూమిని స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.

మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హరీశ్ తెలిపారు. ఎకరం భూమితో పాటు, రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తామని చెప్పారు. మృతుడి కుమార్తెను ప్రభుత్వ ఖర్చుతో చదివిస్తామని తెలిపారు. నర్సింహులు మృతిపై విచారణ జరిపిస్తామని... దోషులను పట్టుకుని, శిక్షిస్తామని చెప్పారు. శవాలపై పేలాలు ఏరుకునే నీచ రాజకీయాలు చేయొద్దని విపక్షాలకు హితవు పలికారు. స్వలాభం కోసం అమాయకులను బలి చేయొద్దని అన్నారు.


More Telugu News