డాలీ సింగ్ ను పెళ్లాడనున్న విలన్ పాత్రల నటుడు కబీర్
- పంజాబీ సింగర్ డాలీ సింగ్ ను పెళ్లాడనున్న కబీర్
- గత ఏడాది జరిగిన నిశ్చితార్థం
- కరోనాతో వాయిదా పడిన వివాహం
దక్షిణాది చిత్రాల్లో విలన్ గా మంచి గుర్తింపును తెచ్చుకున్న కబీర్ ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ప్రముఖ పంజాబీ సింగర్ డాలీ సింగ్ ను ఆయన ప్రేమ వివాహం చేసుకోబోతున్నాడు. గత ఐదేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. గత ఏడాది వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది ప్రారంభంలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పటికీ... కరోనా వారి వివాహానికి అడ్డుగా నిలిచింది.
ఇప్పటికి కూడా కరోనా ఇంకా అదుపులోకి రాలేదు. దీంతో, పరిస్థితి అంతా సర్దుకుంటే ఈ ఏడాది డిసెంబర్ లో పెళ్లి చేసుకోవాలని వీరు నిర్ణయించుకున్నారు. కరోనా కంట్రోల్ లోకి వస్తేనే తమ పెళ్లి ఉంటుందని ఈ సందర్బంగా కబీర్ తెలిపాడు. ముంబైలో పెళ్లి ఉంటుందని, రిసెప్షన్ ఢిల్లీలో ప్లాన్ చేస్తామని చెప్పాడు.
గోపీచంద్ హీరోగా తెరకెక్కిన 'జిల్' సినిమాతో తెలుగులో విలన్ గా కబీర్ ఎంట్రీ ఇచ్చాడు. సాయితేజ్ చిత్రం 'సుప్రీమ్'తో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో కబీర్ నటించాడు. తాజాగా కబీర్ హీరోగా తెలుగులో ఓ సినిమా ప్రారంభమైనట్టు సమాచారం.