విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించకపోతే జరగబోయే పరిణామాలకు మేం బాధ్యులం కాదు: సోమిరెడ్డి హెచ్చరిక
- కావలిలో ఎన్టీఆర్ విగ్రహ కూల్చివేత
- సీఎం వైఎస్ జగన్ స్పందించాలి
- ఇది మంచి సంప్రదాయం కాదు
- కొవిడ్ కారణంగానే ఎన్టీఆర్ అభిమానుల మౌనం
నెల్లూరు జిల్లాలోని కావలి పట్టణం ముసునూరులో దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహం తొలగింపుపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. చాలా ఏళ్ల కిందట స్థానికులు సొంత నిధులతో ఏర్పాటు చేసుకున్న ఈ విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రాంతాన్ని సందర్శించిన సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
'కావలిలో ఎన్టీఆర్ విగ్రహ కూల్చివేతపై సీఎం వైఎస్ జగన్ స్పందించాలి. ఇది మంచి సంప్రదాయం కాదు. విగ్రహాన్ని పునఃప్రతిష్టించండి. ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకోవాలి. కొవిడ్ కారణంగానే ఎన్టీఆర్ అభిమానులు మౌనంగా ఉన్నారు. విగ్రహాన్ని యథాతథంగా ప్రతిష్టించకపోతే జరగబోయే పరిణామాలకు మేం బాధ్యులం కాదు' అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు.