జయలలిత 'వేదనిలయం' నుంచి 4 కేజీల బంగారం, 601 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం
- డిసెంబరు 2016లో కన్నుమూసిన జయలలిత
- వేద నిలయాన్ని స్మారక చిహ్నంగా మార్చనున్న ప్రభుత్వం
- సిటీ సివిల్ కోర్టులో రూ. 67.9 కోట్లు జమ చేసిన ప్రభుత్వం
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివసించిన ‘వేద నిలయం’లో దాదాపు 4 కిలోల బంగారం, 601 కేజీల వెండి, 8,300 పుస్తకాలు, 10,438 డ్రెస్ మెటీరియల్స్, ఇతర దుస్తులు, పూజా సామగ్రి వంటి మొత్తం 32,721 వస్తువులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. డిసెంబరు 2016లో జయలలిత మృతి చెందేంత వరకు ఈ మూడంతస్తుల భవనంలోనే నివసించారు. ఈ భవనాన్ని స్మారక నిలయంగా మార్చనున్నట్టు 2017లో ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ పనులు చేపట్టేందుకు ఇంటిని ఖాళీ చేస్తోంది.
ఫర్నిచర్, పుస్తకాలు, ఆభరణాలు వంటి వస్తువులు సహా వేద నిలయం భవనం మూడేళ్లకు పైగా వాడుకలో లేదని గవర్నర్ ఆర్డినెన్స్ లో పేర్కొన్నారు. కాబట్టి భవన స్వాధీన ప్రక్రియ పూర్తయ్యే వరకు అన్ని స్థిర, చరాస్తులను ప్రభుత్వానికి బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పోయెస్ గార్డెన్‌ను స్మారక చిహ్మంగా మార్చేందుకు దీర్ఘకాలం పట్టే అవకాశం ఉండడంతో ఆమె నివాసంలోని వస్తువులను స్వాధీనం చేసుకోవాలని, చరాస్తులను పురుచ్చి తలైవి డాక్టర్ జె జయలలిత మెమోరియల్ ఫౌండేషన్‌కు బదిలీ చేయాలని తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ ఆర్డినెన్స్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో వేదనిలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఈ నెల 25న ప్రభుత్వం సిటీ సివిల్ కోర్టులో రూ. 67.9 కోట్లు జమచేసింది. ఆదాయ పన్ను శాఖకు జయ బాకీపడిన రూ. 36.9 కోట్లు కూడా ఇందులో ఉన్నాయి.