భారత్‌లో రాఫెల్ ల్యాండింగ్.. పొరుగు దేశాల్లో 8.5 తీవ్రతతో భూకంపం: క్రికెటర్ మనోజ్ తివారీ చమత్కారం
- పొరుగు దేశాలు భారీ కుదుపునకు గురయ్యాయి
- భారత వాయుసేన సామర్థ్యం పెరిగింది
- పొరుగు దేశాలు ఇక రెచ్చగొట్టకపోవచ్చు
భారత్‌లో రాఫెల్ యుద్ధ విమానాలు అడుగుపెట్టిన వెంటనే పొరుగు దేశాల్లో 8.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని టీమిండియా క్రికెటర్ మనోజ్ తివారీ చమత్కరించాడు. రాఫెల్ రాకతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటగా తాజాగా మనోజ్ తివారీ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు. రాఫెల్ విమానాలు భారత్‌లో ల్యాండ్ అయిన వెంటనే పొరుగు దేశాలు భారీ కుదుపునకు గురయ్యాయని అన్నాడు. ఈ విమానాల రాకతో భారత వాయుసేన సామర్థ్యం మరింత పెరిగిందని, ఇకపై పొరుగు దేశాల నుంచి రెచ్చగొట్టడాలు ఉండవని పేర్కొన్నాడు.
కాగా, మొత్తం 36 రాఫెల్ విమానాల కోసం ఫ్రాన్స్‌తో భారత్ ఒప్పందం చేసుకోగా, తొలి విడతగా నేడు ఐదు విమానాలు భారత్‌కు చేరుకున్నాయి. అంబాలాలో ఇవి ల్యాండ్ అయిన వెంటనే దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ముఖ్యంగా అంబాలా ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఒప్పందంలో భాగంగా మిగతా విమానాల్లో మరికొన్ని ఆగస్టులో రానున్నట్టు సమాచారం.