ఎస్సార్‌నగర్ సీఐపై ఆరోపణల కేసు.. ఏసీబీకి ఆధారాలు సమర్పించిన సినీనటి శ్రీసుధ

  • శ్యామ్ కె నాయుడు తనను పెళ్లి పేరుతో మోసం చేశాడని ఫిర్యాదు
  • దర్యాప్తులో భాగంగా సీఐ రూ. 5 లక్షలు వసూలు చేశాడని ఆరోపణ
  • నకిలీ రాజీ పత్రాలు సృష్టించారన్న శ్రీసుధ
కేసు దర్యాప్తులో భాగంగా ఎస్సార్‌నగర్ సీఐ మురళీకృష్ణ తన నుంచి రూ. 5 లక్షలు వసూలు చేశారని ఆరోపించిన సినీ నటి శ్రీసుధ అందుకు సంబంధించిన ఆధారాలను ఏసీబీకి సమర్పించారు. నేడు హైదరాబాద్, నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి వెళ్లిన ఆమె తన దగ్గరున్న ఆధారాలను సమర్పించారు. అలాగే, ఆమె వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేసుకున్నారు.

సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు సోదరుడు శ్యామ్ కె నాయుడు తనను పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ శ్రీసుధ ఇటీవల ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన సీఐ మురళీకృష్ణ తన నుంచి రూ. 5 లక్షలు వసూలు చేశారని ఆరోపించారు. అంతేకాకుండా, నిందితుడిని అరెస్ట్ చేయకుండా రాజీ చేసుకున్నట్టు నకిలీ పత్రాలు సృష్టించారని పేర్కొన్నారు.


More Telugu News