పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌కు ఊరట.. నిషేధం సగానికి తగ్గింపు
- పీసీబీ అవినీతి నిరోధక చట్టాన్ని ఉల్లంఘించిన అక్మల్
- 36 నెలల నిషేధం విధించిన క్రమశిక్షణ కమిటీ
- తీర్పుపై అక్మల్ అసంతృప్తి
రెండు వేర్వేరు సందర్భాల్లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అవినీతి నిరోధక చట్టాన్ని ఉల్లంఘించి మూడేళ్ల నిషేధానికి గురైన పాక్ వికెట్ కీపర్ ఉమర్ అక్మల్‌కు ఊరట లభించింది. అతడిపై ఉన్న నిషేధాన్ని సగానికి అంటే 18 నెలలకు కుదిస్తూ స్వతంత్ర న్యాయ నిర్ణేత, పాకిస్థాన్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఫకీర్ మహమ్మద్ ఖోఖర్ తీర్పు చెప్పారు.
పీసీబీ అవినీతి నిరోధక చట్టాన్ని అక్మల్ ఉల్లంఘించినట్టు తేలడంతో ఈ ఏడాది ఏప్రిల్ 27న క్రమశిక్షణ కమిటీ చైర్మన్, జస్టిస్ ఫజల్-ఇ-మిరాన్ చౌహాన్ మూడేళ్ల నిషేధాన్ని విధించారు. దీంతో తన తప్పును అంగీకరించిన అక్మల్ శిక్షను తగ్గించాలంటూ మే 19న అప్పీల్ చేశాడు. అతడి అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన స్వతంత్ర న్యాయ నిర్ణేత తాజాగా అతడిపై విధించిన నిషేధాన్ని 18 నెలలకు కుదిస్తూ తీర్పు చెప్పారు. ఫలితంగా అతడిపై విధించిన నిషేధం వచ్చే ఏడాది సెప్టెంబరుతో ముగియనుంది.
అయితే, ఈ తీర్పుపై అక్మల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తనకంటే ముందు ఇవే తప్పు చేసిన వారికి చిన్న శిక్షలు విధించి తనకు మాత్రం పెద్ద శిక్ష వేశారని వాపోయాడు. శిక్షను మరింత తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు.