రామ్ గోపాల్ వర్మను అలా వదిలేయడమే మంచిది: ప్రకాశ్ రాజ్

రామ్ గోపాల్ వర్మను అలా వదిలేయడమే మంచిది: ప్రకాశ్ రాజ్
  • వర్మ చాలా విజ్ఞానవంతుడు
  • ఆయనను అలా వదిలేయడం మంచిది
  • పవన్ కల్యాణ్ రేంజ్ చాలా ఎక్కువ
'పవర్ స్టార్' పేరుతో రామ్ గోపాల్ వర్మ మరో వివాదాస్పద సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్మకు, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చే జరిగింది. తాజాగా ఈ అశంపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. వర్మతో తాను ఎక్కువగా పని చేయకపోయినప్పటికీ... ఆయనను చాలా సార్లు కలిశానని ప్రకాశ్ రాజ్ చెప్పారు.

వర్మ చాలా విజ్ఞానవంతుడని... ఆయన నుంచి చాలా నేర్చుకోవచ్చని అన్నారు. ఆయన అందిరిలాంటి మనిషి కాదని... అలాగని అందరూ అనుకుంటున్నట్టు చెడ్డ మనిషి కూడా కాదని చెప్పారు. ఆయనది ఒక విచిత్రమైన వ్యక్తిత్వమని అన్నారు. ఆయన తీసిన సినిమా మనకు నచ్చితే చూడొచ్చని, లేకపోతే వదిలేయొచ్చని చెప్పారు. తన సినిమా చూడమని వర్మ ఎవరినీ బలవంతం చేయడని అన్నారు.

పవన్ కల్యాణ్ గొప్పదనం ఏమిటో అందరికీ తెలుసని... వర్మ తప్పుగా చూపించినంత మాత్రాన పవన్ కు పోయేదేమీ లేదని ప్రకాశ్ రాజ్ చెప్పారు. పవన్ రేంజ్ చాలా ఎక్కువని అన్నారు. వర్మను అలా వదిలేయడమే మంచిదని అన్నారు. వర్మ తన లిమిట్స్ లో ఉంటాడని ఆశిస్తున్నానని చెప్పారు.


More Telugu News