ఏపీలో కరోనా విజృంభణ... ఒక్క రోజులో 10 వేలకు పైగా కొత్త కేసులు!

  • 24 గంటల్లో కొత్తగా 10,093 కేసులు
  • 1,20,390కి చేరిన కేసుల సంఖ్య
  • తూర్పు గోదావరిలో అత్యధికంగా 1,676 కేసుల నమోదు
ఏపీలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం 70,584 మంది శాంపిల్స్ ను పరీక్షించగా... వీరిలో 10,093 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.

జిల్లాల వారీగా చూస్తే... అనంతపురం జిల్లాలో 1371, చిత్తూరు 819, తూర్పుగోదావరి 1676, గుంటూరు 1124, కడప 734, కృష్ణా 259, కర్నూలు 1091, నెల్లూరు 608, ప్రకాశం 242, శ్రీకాకుళం 496, విశాఖ 841, విజయనగరం 53, పశ్చిమగోదావరి జిల్లాలో 779 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 65 మంది కరోనా రక్కసికి బలయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో 14 మంది, అనంతపూర్ 8, విజయనగరం 7, చిత్తూరు 6, కర్నూలు 5, నెల్లూరు 5, కృష్ణా 4, ప్రకాశం 4, గుంటూరు 3, కడప 3, శ్రీకాకుళం 2, విశాఖ 2, పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు మరణించారు.

ఇక ఇప్పటి వరకు మొత్తం 1,20,390 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,213 మంది చనిపోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 63,771గా ఉండగా... 55,406 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.


More Telugu News