కరోనాకు ఔషధాన్ని విడుదల చేసిన హెటిరో... ఒక్కో ట్యాబ్లెట్ ధర ఎంతంటే..!
- ఫెవివిర్ పేరుతో ట్యాబ్లెట్లను విడుదల చేసిన హెటిరో
- ఒక్కో ట్యాబ్లెట్ ధర రూ. 59
- అన్ని మెడికల్ షాపుల్లో లభ్యం కానున్న ట్యాబ్లెట్లు
కరోనా లక్షణాలు స్వల్ప స్థాయిలో ఉన్న వారి కోసం హైదరాబాద్ ఫార్మా కంపెనీ హెటిరో డ్రగ్స్ ఓ ఔషధాన్ని విడుదల చేసింది. 'ఫెవిపిరవిర్' మందును 'ఫెవివిర్' ట్యాబ్లెట్స్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ యాంటీ వైరల్ డ్రగ్ ను సాధారణ కరోనా పేషెంట్లు వాడొచ్చని హెటిరో తెలిపింది.
డ్రగ్ ఉత్పత్తి, మార్కెటింగ్ కి 'డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా' నుంచి అనుమతి లభించిందని వెల్లడించింది. ఒక్కో ట్యాబ్లెట్ ధర రూ. 59గా హెటిరో నిర్ణయించింది. మన దేశంలోని అన్ని మెడికల్ షాపుల్లోనూ ఈ ట్యాబ్లెట్లు దొరుకుతాయని తెలిపింది. హెటిరో హెల్త్ కేర్ లిమిటెడ్ ఈ ట్యాబ్లెట్లను మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ చేస్తుందని వెల్లడించింది.