రైలు కింద పడబోయిన ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన సిబ్బంది.. వీడియో ఇదిగో

  • మహారాష్ట్రలో ఘటన
  • రైలు కదులుతుండగా దిగబోయిన వ్యక్తి
  • ఫ్లాట్‌ఫాం, రైల్వే ట్రాక్‌ మధ్య ఉన్న సందులో పడబోయిన వైనం
మహారాష్ట్రలో ఓ వ్యక్తి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ముంబైలో కదులుతోన్న రైలు దిగబోతూ ఫ్లాట్‌ఫాం, రైల్వే ట్రాక్‌ మధ్య ఉన్న సందులో పడబోయిన ఓ వ్యక్తిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది కే సాహు, మహారాష్ట్ర సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది సోమనాథ్ మహాజన్ కాపాడారు.

52 ఏళ్ల ఓ ప్రయాణికుడు ఆ రైల్వే స్టేషన్‌లో రైలు ఆగిన సమయంలో కాకుండా అది కదిలి వెళ్తున్న సమయంలో అందులోంచి దూకే ప్రయత్నం చేయడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఆ ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన సిబ్బందిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.


More Telugu News