మోడెర్నా కరోనా వ్యాక్సిన్ చాలా ఖరీదేనట!
- ఒక కోర్సు ధర 50 నుంచి 60 డాలర్లు
- అమెరికాకు 4 డాలర్లకే డోస్ ను అందించనున్న ఆస్ట్రాజెనికా
- వివిధ కంపెనీలు, ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నామన్న మోడెర్నా
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కంపెనీలు కరోనా వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమై ఉండగా, మిగతా కంపెనీలతో పోలిస్తే, ముందున్న మోడెర్నా, ఇప్పటికే మూడో దశ ట్రయల్స్ లోకి ప్రవేశించడంతో పాటు, భారీ ఎత్తున వ్యాక్సిన్ తయారీని కూడా ప్రారంభించింది. తమ వ్యాక్సిన్ కోర్సుకు 50 నుంచి 60 డాలర్ల (సుమారు రూ.3,800 నుంచి రూ. 4,500) వరకూ ఉంటుందని తెలుస్తోంది. ఈ ధర ఇతర వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైన పిఫైజర్, బయో ఎన్ టెక్ తదితరాలు నిర్ణయించిన ధరతో పోలిస్తే కనీసం 11 డాలర్లు అధికమని సమాచారం.
ఇక ప్రభుత్వ రంగ కంపెనీలకు రెండు డోస్ ల కోర్సును 39 డాలర్లకు అందించాలని మోడెర్నా భావిస్తున్నట్టు సమాచారం. అయితే, మోడెర్నా ధర అమెరికాతో పాటు, ఇతర అధిక ఆదాయ దేశాలకు మాత్రమేనని 'ఫైనాన్షియల్ టైమ్స్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ధర విషయమై మోడెర్నా ప్రతినిధిని సంప్రదించగా, ఈ విషయంలో ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నామని, తాము ఎంఆర్ఎన్ఏ-1275 పేరిట తయారు చేస్తున్న వ్యాక్సిన్ ప్రోత్సాహకర ఫలితాలను ఇస్తోందని, కచ్చితమైన ధర విషయమై ప్రస్తుతానికి ఏ విషయాన్నీ వెల్లడించలేమని స్పష్టం చేశారు.
వ్యాక్సిన్ ను పెద్దఎత్తున తయారు చేసేందుకు వివిధ ఫార్మా సంస్థలతో చర్చలు జరుపుతున్నామని, కాంట్రాక్టుల విషయంలో మరిన్ని వివరాలను తెలియజేయలేమని ఆయన అన్నారు. పిఫైజర్, మోడెర్నా, మెర్క్ అండ్ కో తదితర సంస్థలు తమ వ్యాక్సిన్ ను కొంత లాభంతోనే విక్రయిస్తామని పేర్కొనగా, జాన్సన్ అండ్ జాన్సన్ వంటి కొన్ని సంస్థలు వ్యాక్సిన్ ను లాభాపేక్ష లేకుండా అందిస్తామని వెల్లడించాయి. కాగా, ఆక్స్ ఫర్డ్ పరిశోధనలు చేస్తున్న వాక్సిన్ ను ఉత్పత్తి చేస్తున్న అస్ట్రా జెనికా పీఎల్సీ, అమెరికాకు 30 కోట్ల డోస్ లను ఇచ్చేందుకు అంగీకరించింది. అందుకు ప్రతిగా, యూఎస్ ప్రభుత్వం నుంచి 1.2 బిలియన్ డాలర్ల ఫండ్ ను అందుకుంది. అంటే, ఒక్కో వ్యాక్సిన్ డోస్ కేవలం 4 డాలర్లు మాత్రమే.