చైనా నుంచి వచ్చిన మహమ్మారిపై త్వరలోనే విజయం: డొనాల్డ్ ట్రంప్

  • అతి త్వరలోనే శుభవార్త
  • అనుమతి రాగానే ప్రజలకు వ్యాక్సిన్
  • భారీ ఎత్తున తయారవుతోందన్న ట్రంప్
చైనాలో పుట్టి, ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి వైరస్ పై అమెరికా విజయం సాధించే రోజు దగ్గర్లోనే ఉందని, అతి త్వరలోనే ప్రపంచం శుభవార్తను వింటుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. తాజాగా, నార్త్ కరోలినాలో పర్యటించిన ఆయన, కరోనాకు వ్యాక్సిన్ తయారు చేస్తున్న సంస్థల పనితీరుపై పొగడ్తల వర్షం కురిపించారు.

 "అమెరికాకు చెందిన శాస్త్రవేత్తల బృందాలు కరోనాపై విజయం సాధించే దిశగా సాగుతున్నాయి. వ్యాక్సిన్ తయారీలో ముందున్న మొడెర్నా, ఇప్పటికే మూడో దశ ట్రయల్స్ ను ప్రారంభించిందని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ భారీ ఎత్తున తయారవుతోంది. ఒకసారి దీనికి అనుమతి లభించగానే, అమెరికన్లందరికీ అందుబాటులోకి వస్తుంది. ప్రపంచానికి కూడా ఈ వ్యాక్సిన్ ను అందించే సత్తా అమెరికాకు ఉంది. చైనా కారణంగానే ప్రపంచం ఇప్పుడు ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొంటోంది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.


More Telugu News