'తాతా... ఏడవకు' అంటూ ధైర్యం చెప్పిన ఆరాధ్య... అమితాబ్ తీవ్ర భావోద్వేగం!

  • హాస్పిటల్ నుంచి ఇంటికి చేరిన ఐశ్వర్య, ఆరాధ్య
  • ఆసుపత్రి నుంచి వచ్చే ముందు తాతయ్య వద్దకు ఆరాధ్య
  • ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకుని కన్నీరు
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ కుటుంబంలో నలుగురు కరోనా బారిన పడి, ముంబై హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన కోడలు ఐశ్వర్యారాయ్ బచ్చన్, మనవరాలు ఆరాధ్యలు పూర్తిగా కోలుకోగా, వారిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు. తల్లితో కలిసి ఇంటికి బయలుదేరిన సమయంలో ఆరాధ్య తాతయ్య అమితాబ్ ను కలిసి, ఆయన్ను ఓదార్చి ధైర్యం చెప్పగా, ఆ సమయంలో అమితాబ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. "తాతా...ఏడవద్దు. నువ్వు త్వరలోనే కోలుకుని ఇంటికి వస్తావు" అని ఆరాధ్య అనగానే, అమితాబ్ కళ్ల నుంచి నీరు కారింది. తనను చూసి ఏడుస్తున్న మనవరాలిని కౌగలించుకున్న ఆయన, ఆరాధ్యకు ధైర్యం చెప్పారు.

కాగా, ఈ నెల 17 నుంచి ఐశ్వర్య, ఆరాధ్యలు ముంబైలోని నానావతి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అంతకు ఒకరోజు ముందే అమితాబ్, అభిషేక్ లు కరోనా సోకి అదే హాస్పిటల్ లో చేరారు. ప్రస్తుతం వారిద్దరికీ ఐసొలేషన్ వార్డులో చికిత్స జరుగుతోంది. అమితాబ్ కోలుకోవాలని ఆయన ఫ్యాన్స్ పూజలు, ప్రార్థనలు చేస్తుండగా, వారికి బచ్చన్ ఫ్యామిలీ కృతజ్ఞతలు తెలిపింది.


More Telugu News