పోలీసు మార్కు దాష్టీకం... హెల్మెట్ ఏదంటూ ఏం చేశాడో చూడండి!
- పెట్రోల్ బంకుకు వెళ్లిన యువకుడు
- హెల్మెట్ ఏదన్న పోలీసు
- తప్పించుకునేందుకు యత్నించిన యువకుడు
- బైక్ తాళం తీసి యువకుడి నుదుటిలో గుచ్చిన పోలీసు
కొన్ని సందర్భాల్లో కొందరు పోలీసులు తీవ్ర అసహనంతో వ్యక్తులపై దాడికి దిగడం మీడియాలో ఎన్నోసార్లు కనిపించింది. ఇది కూడా అలాంటి ఘటనే. ఉత్తరాఖండ్ లోని రుద్రాపూర్ పట్టణంలో దీపక్ అనే కుర్రాడు తన ఫ్రెండ్ తో కలిసి బైక్ లో పెట్రోల్ పోయించుకునేందుకు వెళ్లాడు. అక్కడే విధుల్లో ఉన్న ఓ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు హెల్మెట్ ఏదంటూ దీపక్ బైక్ ను ఆపే ప్రయత్నం చేశారు. పోలీసులు అనే భయంతో దీపక్ బైక్ పై ఆగకుండా వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. దాంతో ఓ పోలీసుకు తీవ్ర ఆగ్రహం కలిగింది. వెంటనే తాళం తీసుకుని దీపక్ నుదుటిపై బలంగా గుచ్చాడు.
ఎంత బలంగా అంటే ఆ తాళం దీపక్ నుదుటి లోపలికి చొచ్చుకునిపోయి అలాగే ఉండిపోయింది. తాళం నుదుటికి ఉండగానే దీపక్ తన కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు తెలిపాడు. దాంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ను ముట్టడించగా, వారిని చెదరగొట్టేందుకు లాఠీచార్జి చేశారు. చివరికి ఘటనకు కారకులైన పోలీసులపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. ఎమ్మెల్యే కూడా గ్రామస్తులకు సర్దిచెప్పి అక్కడ్నించి పంపించి వేశారు. కాగా, దీపక్ నుదుటికి తాళం చెవితో అలాగే తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.