'మదర్ ఇండియా' ఫేం అలనాటి బాలీవుడ్ నటి కుంకుమ్ మృతి
- ఈ ఉదయం బాంద్రాలోని తన నివాసంలో కన్నుమూసిన కుంకుమ్
- ఆమె వయసు 86 సంవత్సరాలు
- 100కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించిన కుంకుమ్
అలనాటి బాలీవుడ్ నటి కుంకుమ్ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె... ముంబై బాంద్రాలోని తన నివాసంలో ఈ ఉదయం గం.11.30 లకు తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 86 సంవత్సరాలు. ఆమె అసలు పేరు జైబున్నీసా. బీహార్ లోని షేక్ పురా జిల్లాలోని హుస్సైనాబాద్ లో ఆమె జన్మించారు.
1954లో గురుదత్ దర్శకత్వం వహించిన 'ఆర్ పార్' సినిమాలోని 'కభీ ఆర్ కభీ పార్..' అనే పాటలో చిన్న డ్యాన్స్ సీక్వెన్స్ ద్వారా ఆమె సినీ రంగానికి పరిచయమయ్యారు. ఆ తర్వాత 'మదర్ ఇండియా' సినిమా ఆమెకు బాగా పేరు తెచ్చింది. తదనంతరం 'ఆంఖే', 'నయా దౌర్', 'సపేరా ఏక్ లూటేరా' తదితర సూపర్ హిట్ చిత్రాల్లో ఆమె నటించారు. భోజ్ పురిలో కూడా నటించి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. దాదాపు 100కు పైగా చిత్రాల్లో ఆమె నటించారు. ఆమె మరణంతో బాలీవుడ్ ఆవేదనలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపం ప్రకటించారు.