అయోధ్య రామ జన్మభూమిపై దాడులకు ఐసిస్ ప్లాన్ చేస్తోంది: ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరిక
- ఆగస్టు 15వ తేదీన అయోధ్యలో దాడులకు ప్లాన్
- ఉగ్రవాదులకు ఆఫ్ఘనిస్థాన్ లో శిక్షణ
- ముష్కరులు మూడు నుంచి ఐదు బృందాలుగా చొరబడే అవకాశం
అయోధ్య రామ జన్మభూమిపై ఆగస్టు 15వ తేదీన దాడులకు ఉగ్రసంస్థ ఐసిస్ ప్లాన్ చేస్తోందని ఇంటెలిజెన్స్ ఏజెన్సీ 'రా' వర్గాలు తెలిపాయి. ఈ దాడుల కోసం లష్కర్, జైషే మొహమ్మద్ ఉగ్రవాదులకు ఆఫ్ఘనిస్థాన్ లో ఐసిస్ ట్రైనింగ్ ఇచ్చిందని సమాచారం. ఐసిస్ ద్వారా శిక్షణ పొందిన ఉగ్రవాదులను మూడు లేదా ఐదు బృందాలుగా భారత్ లోకి పాక్ పంపించబోతోందని చెప్పింది. ఈ బృందాలు ఒక ప్రత్యేకమైన రీతిలో దాడులు చేసేలా పాకిస్థాన్ ప్లాన్ చేస్తోందని... భారత్ లో అంతర్గతంగా దాడులు జరిగాయనే విధంగా ఆ దాడులు ఉండేలా స్కెచ్ వేసిందని తెలిపింది. ఈ దాడుల్లో ముఖ్యంగా వీవీఐపీలను టార్గెట్ చేస్తున్నారని హెచ్చరించింది.