ఈ యువకుడి టాలెంట్ 'అద్భుతం' అంటూ ఆసుపత్రి నుంచి వీడియో పోస్ట్ చేసిన అమితాబ్
- మౌత్ ఆర్గాన్ ప్లే చేసిన యువకుడు
- ఎలక్ట్రానిక్ పరికరాలకు దీటుగా ప్లే
- బిగ్ బీ ప్రశంసల జల్లు
ఓ యువకుడి టాలెంట్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ను ఆకర్షించింది. ఆ యువకుడి నైపుణ్యాలకు సంబంధించిన ఓ వీడియోను అమితాబ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఓ యువకుడు మౌత్ ఆర్గాన్ ప్లే చేస్తూ ఈ వీడియోలో కనపడ్డాడు. ఎలక్ట్రానిక్ వాయిద్య పరికరాలకు దీటుగా కేవలం శ్వాసతోనే ఆ యువకుడు అద్భుతమైన సంగీతం వినిపించాడు.
గతంలో తాను ఎన్నడూ ఇటువంటి అద్భుత సంగీతం వినలేదంటూ అమితాబ్ ప్రశంసల జల్లు కురిపించారు. 'అద్భుతం, అద్భుతం, అద్భుతం' అని బిగ్ బీ పేర్కొన్నారు. కాగా, కరోనాతో నానావతి ఆసుపత్రిలో చేరిన అమితాబ్ బచ్చన్ సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు టచ్‌లోనే ఉంటున్నారు.
ప్రజలకు కరోనాపై జాగ్రత్తలు చెబుతూ కూడా ట్వీట్లు చేస్తున్నారు. నానావతి ఆసుపత్రిలోనే ఆయన కుమారుడు అభిషేక్ కూడా కరోనాకు చికిత్స తీసుకుంటున్నాడు. అమితాబ్ కోడలు, సినీనటి ఐశ్వర్యరాయ్, ఆమె కూతురు నిన్న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.