వివాహ వేడుకలో పాల్గొన్న 43 మందికి కరోనా.. పెళ్లి కుమార్తె తండ్రిపై కేసు నమోదు
- కేరళలోని కాసర్‌గఢ్‌లో ఘటన
- వధూవరులకు కూడా సోకిన కరోనా
- అందరూ క్వారంటైన్‌కు
కరోనా వైరస్ కబళిస్తున్న వేళ అప్రమత్తంగా ఉండాల్సింది పోయి తన కుమార్తె పెళ్లిని ఘనంగా చేసి 43 మందికి వైరస్ సోకడానికి కారణమయ్యాడు ఓ వ్యక్తి. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. కేరళలోని కాసర్‌గఢ్ జిల్లాలో జరిగిందీ ఘటన. కొవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించి నిర్వహించిన ఈ పెళ్లి వేడుకకు హాజరైన వారిలో ఏకంగా 43 మంది కొవిడ్ బారినపడ్డారు.
నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున వేడుకకు హాజరు కావడంతో స్పందించిన అధికారులు అందరికీ పరీక్షలు నిర్వహించగా అందులో వధూవరులు సహా మొత్తం 43 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో వైద్యాధికారులు అందరినీ క్వారంటైన్‌కు తరలించారు. ఇక, నిబంధనలు ఉల్లంఘించి పెళ్లి చేసిన వధువు తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు.