కరోనా ఎఫెక్ట్.. మరో ఏడాది వరకు గూగుల్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్?
- ఇంకా కంట్రోల్ లోకి రాని కరోనా
- వర్క్ ఫ్రమ్ హోమ్ ను పొడిగించడంపై గూగుల్ చర్చ
- 2 లక్షల మంది ఉద్యోగులకు ఉపయోగకరం
ప్రపంచంపై కరోనా పంజా విసిరి నెలలు గడుస్తున్నా... ఇంకా మహమ్మారి కంట్రోల్ లోకి రాలేదు. భారీ ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. కరోనా నేపథ్యంలో, చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని కల్పించాయి. తాజాగా గూగుల్ గురించి ఒక వార్త వైరల్ అవుతోంది. వచ్చే ఏడాది జూలై వరకు గూగుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఈ అంశంపై గత వారం గూగుల్ బోర్డు చర్చించింది. వర్క్ ఫ్రమ్ హోమ్ గడువును పెంచేందుకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ నిర్ణయించారని సమాచారం. అయితే, దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇదే జరిగితే గూగుల్ లో పని చేస్తున్న దాదాపు 2 లక్షల మందికి ఉపయోగకరంగా ఉంటుంది. మరోవైపు ఇంత స్థాయిలో వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కల్పించిన సంస్థగా గూగుల్ అవతరించనుంది.