కరోనా వ్యాక్సిన్ అంశంలో వివాదంపై వివరణ ఇచ్చిన సీరం ఇన్ స్టిట్యూట్
- పార్శీలకు కొన్ని డోసులు జాగ్రత్త చేస్తామన్న సీఈవో
- ఈ వ్యాఖ్యలతో ప్రజల్లో గందరగోళం
- ప్రభుత్వమే వ్యాక్సిన్ పంపిణీ చేస్తుందన్న సీరం ఇన్ స్టిట్యూట్
ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ రూపొందించిన కొవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ ను భారత్ లో ఉత్పత్తి చేసేందుకు లైసెన్స్ పొందిన సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఓ వివాదంపై వివరణ ఇచ్చింది. ఇటీవల సీరం ఇన్ స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా చేసిన ఓ ట్వీట్ వివాదానికి దారితీసింది.
కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ముందుగా పార్శీల కోసం కొన్ని డోసులను జాగ్రత్త చేస్తాం అని పూనావాలా ట్వీట్ చేశారు. ఆయన చేసిన ఈ ట్వీట్ గందరగోళానికి కారణమైంది. దాంతో సీరం ఇన్ స్టిట్యూట్ స్పందించక తప్పలేదు. ఆ ట్వీట్ ఒకే వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణలో భాగంగా దొర్లిందని, అది సరదాగా చేసిన ట్వీట్ మాత్రమేనని స్పష్టం చేసింది. అంతేకాదు, కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత వ్యాక్సిన్ పంపిణీ బాధ్యతలు ప్రభుత్వమే చూసుకుంటుందని, ప్రైవేటు సంస్థలకు బదులు ప్రభుత్వమే వ్యాక్సిన్ ను ప్రజలకు అందిస్తుందని సీరం ఇన్ స్టిట్యూట్ స్పష్టం చేసింది.