అమరరాజా భూముల వ్యవహారంలో.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

  • గతంలో అమరరాజా సంస్థకు 483 ఎకరాలు కేటాయింపు
  • 253 ఎకరాలు వెనక్కి తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధం
  • జీవో జారీ చేయడంతో కోర్టును ఆశ్రయించిన అమరరాజా
అమరరాజా ఇన్ ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ భూముల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. అమరరాజా సంస్థ నుంచి భూములను వెనక్కితీసుకోవడంపై ఇచ్చిన జీవో అమలు నిలుపుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. గతంలో అమరరాజా సంస్థకు చిత్తూరు జిల్లాలో 483 ఎకరాల భూమిని కేటాయించారు. అయితే, వైసీపీ ప్రభుత్వం ఆ భూమిలో 253 ఎకరాలను వెనక్కి తీసుకునేందుకు జీవో జారీ చేయగా, ఆ జీవోను సవాల్ చేస్తూ అమరరాజా సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. అమరరాజా పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం జీవో అమలుపై స్టే ఇచ్చింది.

2009లో వైఎస్సార్ ప్రభుత్వ హయాంలో చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం, యాదమర్తి మండలాల్లో 483.27 ఎకరాలను అప్పటి ఏపీఐఐసీ అమరరాజా సంస్థకు కేటాయించింది. ఇప్పుడా స్థలంలోనే ఖాళీగా ఉన్న 253.6 ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకునేందుకు సిద్ధమైంది. ఒప్పందం ప్రకారం మొత్తం భూమిని వినియోగంలోకి తీసుకువచ్చి, ప్రత్యేక ఆర్థికమండలి (ఎస్ఈజెడ్) ఏర్పాటు చేస్తామన్న హామీ నెరవేర్చలేదన్నది ప్రభుత్వ ఆరోపణగా తెలుస్తోంది.


More Telugu News