గర్భిణీ సింధూరెడ్డి విషాదాంతం... కర్నూలు బ్రిడ్జి వద్ద మృతదేహం లభ్యం
- కలుగొట్ల వాగులో కొట్టుకుపోయిన కారు
- రెండ్రోజులుగా సింధూరెడ్డి కోసం గాలింపు
- శవమై కనిపించడంతో కుటుంబంలో తీవ్ర విషాదం
కడప జిల్లాకు చెందిన నాగసింధూరెడ్డి, శివశంకర్ రెడ్డి దంపతులు ప్రయాణిస్తున్న కారు రెండ్రోజుల కిందట గద్వాల జిల్లా కలుగొట్ల వాగులో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి శివశంకర్ రెడ్డి, ఆయన స్నేహితుడు జిలానీ బాషా బయటపడ్డారు. సింధూరెడ్డి వరదనీటిలో గల్లంతు కాగా, అప్పటినుంచి గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా, ఆమె మృతదేహాన్ని తుంగభద్ర నదిలో కర్నూలు బ్రిడ్జి వద్ద కనుగొన్నారు. గర్భిణీ సింధూరెడ్డి శవమై కనిపించిందన్న సమాచారంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
కడప జిల్లాకు చెందిన సింధూరెడ్డి, శివశంకర్ రెడ్డి... జిలానీబాషాతో కలిసి బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా కలుగొట్ల వాగు వద్ద వరద ఉద్ధృతిలో కారు కొట్టుకునిపోయింది. గర్భిణీ కావడంతో త్వరగా కారు నుంచి దిగలేక సింధూరెడ్డి గల్లంతైంది. ఆ సమయంలో వెనుక డోర్ తెరుచుకోకపోవడం వల్ల ఆమె తప్పించుకునే వీల్లేకపోయింది.