కరోనా నేపథ్యంలో అంబులెన్సులు విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చిన తెలంగాణ ప్రజాప్రతినిధులు

  • అంబులెన్స్ లు కొనేందుకు ఆసరా
  • చెక్ లను కేటీఆర్ కు అందించిన నేతలు
  • అత్యధికంగా 6 అంబులెన్స్ లకు విరాళం ఇచ్చిన మంత్రి మల్లారెడ్డి
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోన్న తరుణంలో వైద్య సేవలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు అక్కడి ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. అంబులెన్స్ లు కొనేందుకు ప్రభుత్వానికి విరాళాలు ఇస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి అత్యధికంగా 6 అంబులెన్స్ లు కొనుగోలు చేసేందుకు విరాళం అందించారు. కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 2, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి 2, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ 2, ఎమ్మెల్సీ రాజు 1, టీఆర్ఎస్ నేత మర్రి రాజశేఖర్ 1 చొప్పున అంబులెన్సుల కోసం చెక్ లను టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అందించారు.


More Telugu News