నెల్లూరు జిల్లా కావలి సమీపంలో క్షుద్రపూజల కలకలం!
- అటవీప్రాంతంలో క్షుద్రపూజలు
- మహిళ బొమ్మ మధ్యలో అమ్మాయి ఫొటో
- గుర్తించిన స్థానికులు
టెక్నాలజీ విస్తృతస్థాయిలో ప్రజాజీవితాలను ప్రభావితం చేస్తున్న ఈ రోజుల్లోనూ చేతబడి, బాణామతి, చిల్లంగి వంటి క్షుద్రపూజలను నమ్మేవారున్నారంటే అతిశయోక్తి కాదు. నెల్లూరు జిల్లా కావలి వద్ద కనిపించిన క్షుద్రపూజల ఆనవాళ్లే అందుకు నిదర్శనం. కావలి సమీపంలోని అటవీప్రాంతంలో కొందరు వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించినట్టుగా కొన్ని చిహ్నాలు కనిపించాయి. సున్నంతో ఓ మహిళ బొమ్మను గీసి ఆ బొమ్మ మధ్యలో ఓ అమ్మాయి ఫొటో ఉంచారు. గుమ్మడి కాయ, నిమ్మకాయలు, పసుపు, కుంకుమతో అక్కడంతా భయానకంగా ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. అయితే ఇది ఎవరు చేశారన్నది ఇంకా తెలియరాలేదు.