అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ పై ముగిసిన వాదనలు... తీర్పు రిజర్వులో ఉంచిన హైకోర్టు

  • ఈఎస్ఐ కొనుగోళ్ల వ్యవహారంలో అచ్చెన్న అరెస్ట్
  • బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్
  • జూలై 29న తీర్పు వెలువరించే అవకాశం
ఈఎస్ఐ కొనుగోళ్ల వ్యవహారంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బెయిల్ కోరుతూ అచ్చెన్నాయుడు హైకోర్టును ఆశ్రయించగా, ఆయన పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది. బెయిల్ పై ఇరుపక్షాల వాదనలు కొద్దిసేపటి క్రితం ముగిశాయి. అయితే హైకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. ఎల్లుండి తీర్పు వెలువరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా, అచ్చెన్నాయుడు అంతకుముందు బెయిల్ కోరుతూ ఏసీబీ కోర్టును ఆశ్రయించగా, లభించలేదు. ఆయన బెయిల్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.


More Telugu News