భారత్ రానున్న రాఫెల్ యుద్ధ విమానాల గురించి మరికొన్ని వివరాలు ఇవిగో!
- జూలై 29 నాటికి భారత్ చేరుకోనున్న రాఫెల్ విమానాలు
- 7 వేల కిలోమీటర్లు ప్రయాణం చేయనున్న ఫైటర్లు
- సరిహద్దు దాటకుండానే శత్రు విమానాలను కూల్చే సత్తా
భారత వాయుసేన గగనతల పోరాట సామర్థ్యాన్ని ఇనుమడింపజేసే రాఫెల్ యుద్ధ విమానాలు మరో రెండ్రోజుల్లో అంబాలా ఎయిర్ బేస్ చేరుకోనున్నాయి. ఫ్రాన్స్ నుంచి కొద్ది సేపటి క్రితమే ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ బయల్దేరాయి. ఇవి ఫ్రాన్స్ నుంచి భారత్ కు చేరుకునే క్రమంలో దాదాపు 7 వేల కిలోమీటర్లు ప్రయాణించనున్నాయి. అయితే మధ్యలో యూఏఈలో ఇంధనం నింపుకుంటాయి.
కాగా, ఈ బ్యాచ్ లో భారత్ వస్తున్న 5 రాఫెల్ జెట్లలో మూడు విమానాలు 2 సీట్లవి కాగా, రెండు విమానాలు మాత్రం సింగిల్ సీట్ విమానాలు. రాఫెల్ విమానాల్లో అత్యంత విధ్వంసకర ఆయుధాలు అమర్చి ఉంటాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సునిశితమైన రాడార్లు, ఎలక్ట్రానిక్ యుద్ధ తంత్ర వ్యవస్థలు, స్వీయ రక్షణ సూట్లు రాఫెల్ సొంతం.
సరిహద్దు దాటకుండానే శత్రుదేశాల యుద్ధ విమానాలు, లక్ష్యాలను తుత్తునియలు చేయగలదు. 300 కిలోమీటర్ల రేంజ్ ఉండే స్కాల్ప్ (గగనతలం నుంచి భూతలంపైకి) క్షిపణులు, సుదూర లక్ష్యాలను కూడా ఛేదించే మెటియోర్ (ఎయిర్ టు ఎయిర్) మిస్సైళ్లతో రాఫెల్ గగనతలంలోకి ఎగిరిందంటే శత్రు దేశాల వెన్నులో చలిపుట్టించగలదు. రాఫెల్ యుద్ధ విమానాలు 780 కిలోమీటర్ల పరిధిలో ప్రభావం చూపిస్తాయి. అవసరం అనుకుంటే ప్రత్యేక ఆపరేషన్లలో 1,650 కిలోమీటర్ల వరకు సత్తా చాటగలవు.
ఇందులో ఇజ్రాయెల్ తయారుచేసిన హెల్మెట్ డిస్ ప్లే ద్వారా పైలెట్లకు ఎంతో సమయం ఆదా అవుతుంది. శత్రు దేశాల రాడార్లను, ఎలక్ట్రానిక్ వ్యవస్థలను నిశ్చేష్టకు గురిచేసే లో బ్యాండ్ జామర్లు దీనిలో అమర్చారు. అన్నిటికంటే ముఖ్యంగా, ఎత్తయిన ప్రాంతాల్లోనూ రాఫెల్ సమర్థతలో ఎలాంటి తేడా ఉండదు. రాఫెల్ విమానాలను ఫ్రాన్స్ కు చెందిన డసో ఏవియేషన్ సంస్థ తయారుచేస్తోంది.
ఇప్పటివరకు భారత్ కు 10 రాఫెల్ యుద్ధ విమానాలను అందించగా, వాటిలో ఐదు విమానాలు శిక్షణ కోసం ఫ్రాన్స్ లోనే ఉండిపోయాయి. ఇప్పుడా ఐదు విమానాలే భారత్ రానున్నాయి. ఈ శత్రుభీకర యుద్ధ విమానాల కోసం భారత ప్రభుత్వం 2016లో రూ.59 వేల కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం 2021 చివరి నాటికి 36 రాఫెల్ జెట్ ఫైటర్లను అందించాల్సి ఉంది.