దాదాపు 5 వేల మంది ప్రాణాలు తీశాడు.. 93 ఏళ్ల వయసులో కోర్టు దోషిగా తేల్చింది!
- రెండో ప్రపంచయుద్ధ సమయంలో నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంపు గార్డుగా ఉన్న డెయ్
- అప్పటికి అతని వయసు 17 సంవత్సరాలు
- శిక్షను పెండింగ్ లో ఉంచిన జర్మనీ కోర్టు
నాటి జర్మన్ నియంత హిట్లర్ నిర్దాక్షిణ్యంగా కొనసాగించిన మారణకాండలో దాదాపు 65 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో నరమేధం జరిగింది. ఆ సమయంలో కాన్సట్రేషన్ క్యాంప్ గార్డుగా బ్రూనో డెయ్ అనే వ్యక్తి పని చేశాడు. ఈ మారణకాండలో అతను కూడా పాలుపంచుకున్నాడు. దాదాపు 5,232 మంది ప్రాణాలను బలిగొన్నాడు.
అప్పటికి అతని వయసు 17 సంవత్సరాలు. రెండో ప్రపంచయుద్ధం ముగిసిన తర్వాత డెయ్ కి రెండు నెలల సస్పెన్షన్ విధించి... ఆ తర్వాత విధుల్లోకి తీసుకున్నారు. అయితే ఈ కేసును సుధీర్ఘంగా విచారించిన జర్మనీ కోర్టు డెయ్ ని దోషిగా తేల్చింది. అతనికి విధించబోయే శిక్షను పెండింగ్ లో ఉంచింది. ప్రస్తుతం డెయ్ వయసు 93 సంవత్సరాలు.