తెలంగాణ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు

  • కరోనా పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం
  • తమ ఆదేశాలను పట్టించుకోవడంలేదని ఆరోపణ
  • జూన్ 8 నుంచి ఒక్క ఉత్తర్వును అమలు చేయలేదని ఆగ్రహం
కరోనా నేపథ్యంలో దాఖలైన పిటిషన్లపై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు తెలంగాణ ప్రభుత్వం తీరును తప్పుబట్టింది. కరోనా కేసుల విషయంలో తమ ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, జూన్ 8 నుంచి ఒక్క ఉత్తర్వును కూడా అమలు చేయలేదని అసహనం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలు ఎందుకు అమలు చేయడంలేదో ప్రభుత్వ అధికారులు వెల్లడించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం తమ ఆదేశాలపై నిర్లక్ష్యం చూపడం విచారకరం అని వ్యాఖ్యానించింది. కరోనా కేసుల వివరాలతో ఆరోగ్యశాఖ విడుదల చేసే బులెటిన్ లో సమాచారం సరైన రీతిలో లేదని, దీనిపై సీఎస్ నే ప్రశ్నిస్తామని న్యాయస్థానం పేర్కొంది. అనంతరం విచారణ రేపటికి వాయిదా వేసింది.


More Telugu News