కిడ్నాప్ కేసులో సినీ నిర్మాత పీవీపీకి ముందస్తు బెయిల్ మంజూరు
- ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ను కిడ్నాప్ చేసినట్టు ఆరోపణలు
- పీవీపీ, ఆయన భార్యతో పాటు మరికొందరిపై కేసు
- నాలుగు వారాల్లోగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోవాలని హైకోర్టు ఆదేశం
వైసీపీ నేత, సినీ నిర్మాత పీవీపీకి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ తిమ్మారెడ్డి కిడ్నాప్ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు మరికొందరికి కూడా ఈ కేసులో బెయిల్ మంజూరు అయింది. అయితే నాలుగు వారాల్లోగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోవాలని ఆదేశించింది.
కేసు వివరాల్లోకి వెళ్తే, తన భర్త తిమ్మారెడ్డిని పీవీపీ బౌన్సర్లు కిడ్నాప్ చేసి, విజయవాడకు తరలించారంటూ ఆయన భార్య జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత... పీవీపీతో పాటు మరికొందరు తనను కిడ్నాప్ చేశారని... విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పీవీపీ, ఆయన భార్య, మరికొందరిపై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. అయితే ఈ కిడ్నాప్ తో తమకు సంబంధం లేదని, తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని వీరంతా హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో వీరందరికీ కోర్టు యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేసింది.