తెలంగాణలో గంటకు 62 చొప్పున కరోనా కేసులు.. ఆందోళనలో అధికారులు
- ఈ నెల 1 నుంచి 25 మధ్య 37,720 కేసుల నమోదు
- రెండోస్థాయి పట్టణాలకు వ్యాపిస్తున్న కరోనా
- వరంగల్‌లో రోజుకు సగటున వంద కేసులు
తెలంగాణలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గంటకు సగటున 62 మంది కరోనా బారినపడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నెలలో అయితే రాష్ట్రంలో కరోనా విశ్వరూపం చూపించింది. ఈ నెల 1వ తేదీ నుంచి 25 మధ్య ఏకంగా 37,720 కేసులు వెలుగు చూడడం ఆందోళనకు గురిచేస్తోంది. గత కొన్ని రోజులుగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్టు అనిపిస్తున్నా జిల్లాల్లో మాత్రం అనూహ్యంగా కేసులు పెరుగుతున్నాయి.
వరంగల్‌లో రోజుకు సగటున 100 కేసులు నమోదవుతుండడం గమనార్హం. కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్ వంటి రెండోస్థాయి పట్టణాల్లోనూ వైరస్ విజృంభిస్తోంది. వైరస్ చెలరేగుతున్నప్పటికీ ఇప్పటికీ చాలామంది నిబంధనలు పాటించకపోవడం అధికారులను కలవరపెడుతోంది. గుంపులుగా ఒకే చోట చేరడం, మాస్కులు ధరించకపోవడం, చేతులు శుభ్రం చేసుకోకపోవడం వల్ల వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని అధికారులు చెబుతున్నారు.
కాగా, ఈ నెల 25 నాటికి తెలంగాణలో మొత్తం 54,059 కేసులు నమోదు కాగా, 41,332 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 463 మంది కరోనా కారణంగా మృతి చెందారు. వివిధ ఆసుపత్రులు, ఐసోలేషన్‌లలో ఇంకా 12,264 మంది చికిత్స పొందుతున్నారు. అలాగే, ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,53,425 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు.