ఏపీలో 1000 దాటిన కరోనా మరణాలు... ఒక్కరోజులో 56 మంది మృతి
- రాష్ట్రంలో ఇప్పటివరకు 1,041 మంది మృత్యువాత
- గత 24 గంటల్లో 7,627 మందికి పాజిటివ్
- లక్షకు చేరువలో పాజిటివ్ కేసులు
ఏపీలో కరోనా తీవ్రతకు అడ్డుకట్ట పడట్లేదు. కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 1000 దాటింది. గడచిన 24 గంటల వ్యవధిలో 56 మంది మృత్యువాత పడ్డారు. దాంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 1,041కి పెరిగింది. అటు, కొత్తగా 7,627 మందికి పాజిటివ్ అని తేలింది. దాంతో మొత్తం కేసుల సంఖ్య 96,298కి చేరింది. రేపటితో లక్ష దాటడం ఖాయంగా కనిపిస్తోంది.
అయితే కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అవుతున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుండడం రాష్ట్ర వర్గాలకు ఊరట కలిగిస్తోంది. ఇవాళ 3,041 మంది డిశ్చార్జి అవగా, ఇప్పటివరకు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 46,301గా నమోదైంది. ప్రస్తుతం 48,956 మంది ఆసుపత్రుల్లో, కొవిడ్ కేర్ సెంటర్లలో, హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు.
కొత్త కేసుల్లో జిల్లాల వారీగా చూస్తే కర్నూలు (1,213), తూర్పు గోదావరి (1,095) జిల్లాల్లో మరోసారి భారీగా పాజిటివ్ కేసులు వచ్చాయి. ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 300 కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి.