కరోనా ప్రభావం ఎలా ఉంటుందో డబ్ల్యూహెచ్ఓ, ఐసీఎంఆర్ కు కూడా తెలియలేదు: ఈటల

  • కరోనా రాకతో ప్రపంచం అప్రమత్తమైందన్న ఈటల
  • కరోనాకు ఎవరూ అతీతులు కారని వెల్లడి
  • భగవంతుడి తర్వాత స్థానం వైద్యుడిదేనని ఉద్ఘాటన
తెలంగాణలో కరోనా పరిస్థితులపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. కరోనాకు ఎవరూ అతీతులు కాదని, అందరికీ సోకుతుందని తెలిపారు. 81 శాతం మందిలో కరోనా వైరస్ సోకినట్టు కూడా తెలియదని అన్నారు. అయితే, కరోనా రాకతో ప్రపంచమంతా అప్రమత్తమైందని, వాస్తవానికి కరోనా ప్రభావం ఎలా ఉంటుందన్నది డబ్ల్యూహెచ్ఓ, ఐసీఎంఆర్ లకు కూడా తెలియదని పేర్కొన్నారు.

ఇప్పుడు వర్షాకాలం రావడంతో కరోనాకు సీజనల్ వ్యాధులు కూడా తోడవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి వైద్యులు సేవలు అందిస్తుంటే కొందరు అవహేళన చేస్తున్నారని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో భగవంతుడి తర్వాత అంతటి స్థానం వైద్యుడికే దక్కుతుందని స్పష్టం చేశారు.


More Telugu News