ప్రపంచంలోనే అతిపెద్ద భగవద్గీత పుస్తకం ఇదే.. బరువు 800 కిలోలు!

  • ఇటలీలో బాహుబలి భగవద్గీత పుస్తకావిష్కరణ
  • 670 పేజీలతో భారీ పుస్తకం
  • ఒక పేజీ తిప్పాలంటే ఆరుగురు వ్యక్తుల సాయం
కృష్ణుడి తత్వాన్ని, లీలలను ప్రబోధించే ఇస్కాన్ వారు ప్రపంచంలోనే అతిపెద్ద భగవద్గీత పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇటలీలోని మిలాన్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పుస్తకాన్ని ప్రదర్శించారు. ప్రపంచంలో ఇప్పటివరకు ఇదే అతిపెద్ద పుస్తకం అని చెప్పాలి.

ఈ బాహుబలి భగవద్గీత పుస్తకం బరువు 800 కిలోలు కాగా, దీంట్లో 670 పేజీలున్నాయి. ఒక పేజీ తిప్పాలంటే నలుగురి నుంచి ఆరుగురు మనుషులు అవసరం అవుతారు. దీని కవర్ పేజీ తెరవడానికి అత్యంత ప్రయాసపడ్డారంటే ఇది ఎంత భారీ పుస్తకమో అర్థం చేసుకోవచ్చు. ఈ పుస్తకానికి ఇస్కాన్ భక్తబృందం సభ్యులు హారతి పట్టారు.


More Telugu News