ఢిల్లీలో కరోనా వ్యాప్తి తగ్గిపోతోంది.. ఆసుపత్రుల్లో పడకలు ఖాళీ అవుతున్నాయి: కేజ్రీవాల్

  • ఈ నెల 23 నుంచి ఆసుపత్రుల్లో పడకల ఆక్యుపెన్సీ తగ్గింది
  • అతి తక్కువ మందికే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉంది
  • కరోనా ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతోంది
  • చికిత్స పొందుతున్న వారి కేసుల్లో ఢిల్లీ 8వ స్థానంలో ఉంది
కరోనా విజృంభణతో వణికిపోయిన ఢిల్లీలో ప్రస్తుతం ఆ వైరస్‌ వ్యాప్తి తగ్గింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయంపై పలు వివరాలు తెలిపారు. ఈ నెల 23 నుంచి ఆసుపత్రుల్లో పడకల ఆక్యుపెన్సీ చాలా వరకు పడిపోయిందని చెప్పారు. ఇంతకు ముందుతో పోల్చి చూస్తే ప్రస్తుతం తక్కువ మందికి  కరోనా సోకుతోందని చెప్పారు.

వారిలోనూ అతి తక్కువ మందికే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉందని వివరించారు.  దీంతో ప్రస్తుతం కరోనా ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతోందన్నారు.  తాజా గణాంకాల ప్రకారం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి  కేసుల్లో ఢిల్లీ ఎనిమిదో స్థానంలో ఉందని తెలిపారు. ఇటీవల ఢిల్లీలో పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో వైరస్‌ను ఎదుర్కొనే చర్యలను చేపట్టామని, దీంతో దాని వ్యాప్తిని నిలువరించామని చెప్పారు. ఢిల్లీ  ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.  వైరస్‌ సోకి కోలుకునే వారి సంఖ్య 87 శాతంగా ఉండడం శుభపరిణామమని తెలిపారు.



More Telugu News