ముఖ్యమంత్రిగా మీరెందుకు ఈ పని చేయలేక పోతున్నారో చెప్పండి జగన్ గారు: దేవినేని ఉమ

  • నిన్న 7,813 కరోనా కేసులు, 52 మరణాలు
  • 10 సెకండ్లకొక కేసు నమోదు
  • చంద్రబాబు జీఎఫ్‌ఎస్‌డీ  ద్వారా నిపుణులతో మాట్లాడారు
  • వారిలో మనో ధైర్యం నింపారు
ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిపోతోన్న కరోనా కేసులను ప్రస్తావిస్తూ వైసీపీ సర్కారుపై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. 'నిన్న 7,813 కేసులు, 52 మరణాలు,10 సెకండ్లకొక కేసు నమోదు. కరోనా వేళ ఫ్రంట్ లైన్ వారియర్స్  త్యాగాలను చంద్రబాబు నాయుడు  గుర్తిస్తూ  జీఎఫ్‌ఎస్‌డీ  ద్వారా నిపుణుల సలహాలు, సూచనలతో ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారిలో మనో ధైర్యం నింపారు. ముఖ్యమంత్రిగా మీరెందుకు ఈ పని చేయలేక పోతున్నారో చెప్పండి జగన్‌ గారు' అని దేవినేని ఉమ నిలదీశారు.

ఈ సందర్భంగా నిన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వెబినార్‌లో ప్రముఖ వైద్యులతో మాట్లాడిన విషయానికి సంబంధించిన వార్తలను ఆయన పోస్ట్ చేశారు. కరోనా రోగులకు తాము అందించిన చికిత్సలో గుర్తించిన విషయాలను చంద్రబాబుతో వైద్యులు పంచుకున్నారు. కరోనా పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినప్పటికీ కరోనా లక్షణాలు ఉన్న వారు 72 గంటలపాటు ఇంట్లోనే ఉండటం మంచిదని వైద్యులు సూచించినట్లు అందులో పేర్కొన్నారు. కరోనా లక్షణాలు ఇంకా పెరిగే అవకాశం ఉందా? అన్న విషయం తెలియడానికి ఈ వ్యవధి అవసరమని వైద్యులు తెలిపారు.  


More Telugu News