ఐపీఎల్‌తో దేశం మూడ్ మారిపోతుంది: గంభీర్

  • సెప్టెంబరులో యూఏఈలో ప్రారంభం కానున్న ఐపీఎల్
  • కరోనా భయాల నుంచి ఐపీఎల్ బయటపడేస్తుందన్న గంభీర్
  • గతంలో లీగుల కంటే గొప్పగా నిలుస్తుందని అభిప్రాయం
ఐపీఎల్ మొదలైతే కనుక దేశ ప్రజల మానసిక స్థితి మారుతుందని, కరోనా భయం నుంచి ప్రజలు బయటకు వస్తారని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ పేర్కొన్నాడు. ఐపీఎల్-13వ సీజన్ మొదలైతే ప్రస్తుత భయానక, ఆందోళనకర స్థితి నుంచి దేశ ప్రజలకు సాంత్వన లభిస్తుందని, జాతి మానసిక స్థితి మారుతుందని అన్నాడు. ఐపీఎల్ ఎక్కడ జరుగుతుందనేది అప్రస్తుతమని, జరగడమే ముఖ్యమని అభిప్రాయపడ్డాడు.

19 సెప్టెంబరు నుంచి 8 నవంబరు వరకు ఐపీఎల్ జరగనుండగా, యూఏఈ ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది. ఆట ప్రారంభమైతే విజేతగా నిలిచేది ఎవరు? ఎవరు బాగా ఆడుతున్నారు? ఎవరు ఎక్కువ వికెట్లు తీస్తారు? అనే దానికంటే దేశం మూడ్ మారుతుందని గంభీర్ పేర్కొన్నాడు. ప్రస్తుత కరోనా భయాందోళనల మధ్య ఐపీఎల్ జరిగితే గతంలో జరిగిన లీగ్‌ల కంటే గొప్పగా నిలిపోతుందని అన్నాడు.


More Telugu News