నేడు షాలినితో నితిన్ వివాహం... వేదిక, ముహూర్తం వివరాలు!

  • నేటి రాత్రి 8.30 గంటలకు వివాహం
  • వేదికగా తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్
  • కుటుంబీకులు, సన్నిహితులకే పిలుపు
తన ప్రియురాలు కందుకూరి షాలినిని హీరో నితిన్ నేడు వివాహం చేసుకోనున్నాడన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వివాహ వేడుకలు ప్రారంభం కాగా, మెహందీ ఫంక్షన్ చిత్రాలు వైరల్ అయ్యాయి. నితిన్ ఎంతగానో అభిమానించే పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఇప్పటికే స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇక, నేటి రాత్రి 8.30 గంటలకు, తాజ్ ఫలక్ నుమా హోటల్ వేదికగా, ఈ జంట ఒకటి కానుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ఈ కార్యక్రమం సాగుతుందని ఇప్పటికే నితిన్ సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి. పరిమిత సంఖ్యలో వధూవరుల కుటుంబీకులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారని తెలుస్తోంది.


More Telugu News