కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన రామాయంపేట యువకుడు
- హైదరాబాద్ నిమ్స్‌లో జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్
- రాష్ట్రంలో ఇప్పటి వరకు ముగ్గురిపై ప్రయోగం
- ఆరోగ్యంగానే ఉన్నట్టు వీడియో విడుదల చేసిన రామాయంపేట యువకుడు
భారత్ బయోటెక్ ఆధ్వర్యంలో నిమ్స్‌లో జరుగుతున్న కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన యువకుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతితో హైదరాబాద్‌లోని నిమ్స్‌లో క్లినికల్ పరీక్షలు మొదలయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు ముగ్గురిపై క్లినికల్ పరీక్షలు జరగ్గా, తాజాగా రామాయంపేట యువకుడు ముందుకొచ్చి పరీక్షలు చేయించుకుంటున్నాడు. ఆయన ఆరోగ్యంగా ఉన్నట్టు తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు.