కరోనా వచ్చిన తండ్రికి సాయం... హీరో విశాల్ కు సోకిన మహమ్మారి!
- విశాల్ తండ్రికి తొలుత కరోనా
- ఆయనకు సహాయం చేసే క్రమంలో విశాల్ కు వ్యాధి
- ఆయుర్వేదం వాడుతున్నట్టు ట్వీట్
దక్షిణాది హీరో విశాల్ కరోనా మహమ్మారి బారిన పడ్డారు. తన తండ్రికి కరోనా లక్షణాలైన జ్వరం, జలుబు, దగ్గు కనిపించగా, ఆయనకు తాను సహాయం చేశానని, ఆ క్రమంలో వైరస్ తనకు, తన మేనేజర్ కు సోకిందని తెలిపారు. ప్రస్తుతం తామంతా ఆయుర్వేద వైద్యం తీసుకుంటున్నామని, ఓ వారంలో నెగటివ్ వస్తుందన్న నమ్మకం ఉందని అన్నారు. ప్రస్తుతం తమ ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పడానికి సంతోషిస్తున్నానని విశాల్ వ్యాఖ్యానించారు.