కరోనా నేపథ్యంలో 'బిగ్ బాస్-4' కోసం కట్టుదిట్టమైన చర్యలు!
- త్వరలోనే బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రారంభం
- ఇటీవలే టీజర్ విడుదల చేసిన స్టార్ మా
- హౌస్ మేట్స్ కు భారీస్థాయిలో బీమా!
బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రారంభంపై సందేహాలన్నీ తొలగిపోయాయి. త్వరలోనే బిగ్ బాస్-4 అంటూ స్టార్ మా చానల్ టీజర్ వీడియో రిలీజ్ చేయడంతో బుల్లితెర ప్రేక్షకుల్లో సందడి మొదలైంది. అయితే, ఎక్కడ చూసినా కరోనా వైరస్ మహమ్మారి ప్రమాదకర రీతిలో విజృంభిస్తుండడంతో ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో సజావుగా సాగుతుందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే, బిగ్ బాస్ నిర్వాహకులు ఇప్పటివరకు ఏ షో కోసం తీసుకోనన్ని కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.
బిగ్ బాస్ కంటెస్టెంట్స్, టెక్నీషియన్లు, వ్యాఖ్యాతల కోసం భారీగా ఇన్సూరెన్స్ చేయించారని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ముఖ్యంగా, షో ప్రారంభానికి ముందే హౌస్ మేట్స్ అందరికీ కరోనా టెస్టులు చేయించి, వారిని 15 రోజల పాటు క్వారంటైన్ లో ఉంచి, ఆ తర్వాతే బిగ్ బాస్ హౌస్ లోకి అనుమతించనున్నట్టు సమాచారం.
ఇక ఈ సీజన్ కు కూడా నాగార్జునే హోస్ట్ అనేది దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. హోస్ట్ కు ఆరోగ్య భద్రత కల్పించే విషయంలోనూ నిర్వాహకులు ఏమాత్రం రాజీపడకూడదని భావిస్తున్నారు. ఒక మేకప్ మ్యాన్ మినహా.... హౌస్ మేట్స్ తో సహా, ఇతర టెక్నీషియన్లు ఎవరూ ఆయనను నేరుగా కలవకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రత్యేకంగా బిగ్ బాస్ క్యాంపస్ లో ఓ మెడికల్ టీమ్ ను నిరంతరం అందుబాటులో ఉంచనున్నట్టు సమాచారం.