గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిశోర్ మృతి

  • సోషల్ మీడియాలో నలంద కిశోర్‌ పోస్టులు 
  • నెల రోజుల  క్రితం అరెస్టు చేసిన కర్నూలు సీఐడీ పోలీసులు
  • విశాఖ నుంచి నుంచి కర్నూలుకు తరలించిన పోలీసులు
  • అప్పటి నుంచి  ఆరోగ్యం బాగోలేదంటోన్న కుటుంబ సభ్యులు
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిశోర్‌ మృతి చెందడం కలకలం రేపుతోంది. ఆయన  సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారంటూ  నెల రోజుల  క్రితం కర్నూలు సీఐడీ పోలీసులు అర్ధరాత్రి సమయంలో అదుపులోకి తీసుకున్నారు.

విశాఖపట్నం నుంచి నేరుగా కర్నూలుకు రోడ్డు మార్గంలో తరలించి అక్కడ న్యాయస్థానంలో హాజరుపర్చి, విచారించి ఆయనను తిరిగి వదిలేశారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం బాగోలేదని ఆయన బంధువులు అంటున్నారు. అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన... చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం ప్రాణాలు కోల్పోయారని వారు తెలిపారు.

ఐదు రోజులుగా జ్వరంతో బాధపడ్డారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది. కాగా, నలంద కిశోర్‌ను అరెస్టు చేసిన సమయంలో ఏపీ ప్రభుత్వంపై గంటా శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు.


More Telugu News