మీకు దమ్ముంటే నా ప్రభుత్వాన్ని కూల్చండి: బీజేపీకి ఉద్ధవ్ థాకరే సవాల్
- మా ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉంటుంది
- బీజేపీతో మాకు వచ్చిన నష్టమేమీ లేదు
- చైనా మనకు మిత్రదేశంగా మారొచ్చేమో
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి, రాజస్థాన్‌లో కూల్చేందుకు యత్నిస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శివసేన అధికారిక పత్రిక ‘సామ్నా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఉద్ధవ్.. బీజేపీపై నిప్పులు చెరిగారు. ఆ పార్టీతో తన ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదని తేల్చి చెప్పారు.
తమ ప్రభుత్వం పూర్తి ఐదేళ్లు అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాజకీయ పరిణామాలపై మాట్లాడుతూ.. బీజేపీకి దమ్ముంటే తన ప్రభుత్వాన్ని కూల్చాలని సవాలు విసిరారు. చైనాతో విభేదాలపై స్పందిస్తూ అంతర్జాతీయ సంబంధాల విషయంలో కేంద్రానికి స్పష్టమైన వైఖరి ఉండాలని అన్నారు. ప్రస్తుతం మనం చైనాను వ్యతిరేకిస్తున్నప్పటికీ భవిష్యత్తులో అదే మనకు మిత్ర దేశంగా మారే అవకాశాలను కొట్టిపడేయలేమన్నారు. కాబట్టి అంతర్జాతీయ సంబంధాల విషయంలో మరింత కష్టపడాల్సిన అవసరం ఉందని ఉద్ధవ్ అభిప్రాయపడ్డారు.