తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఓపెన్ స్కూలు విద్యార్థులందరూ పాస్

  • రాష్ట్రవ్యాప్తంగా ఓపెన్ టెన్త్, ఇంటర్ చదువుతున్న 78 వేల మంది
  • ఒక్కో సబ్జెక్టులో 35 మార్కులు ఇవ్వాలని నిర్ణయం
  • పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోవడంతోనే రద్దు
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం తాజాగా ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుండడంతో పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని ఓ నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం అందరినీ పాస్ చేస్తున్నట్టు తెలిపింది. అలాగే, విద్యార్ధులందరికీ ఒక్కో సబ్జెక్టులో 35 మార్కులు ఇవ్వాలని నిర్ణయించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఓపెన్ టెన్త్ చదువుతున్న 35 వేల మంది, ఓపెన్ ఇంటర్ చదువుతున్న 43 వేల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.


More Telugu News