వివాదాస్పద సామాజిక కార్యకర్త రెహానా ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత

  • అర్ధనగ్న శరీరంపై పిల్లలతో బాడీ పెయింటింగ్
  • పోక్సో చట్టం కింద కేసు నమోదు
  • కేసు దర్యాప్తు కొనసాగించాలన్న కోర్టు
తన అర్ధనగ్న శరీరంపై పిల్లలతో పెయింటింగ్ వేయించుకుని, వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన కేసులో వివాదాస్పద సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమా ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కేరళ హైకోర్టు కొట్టివేసింది. ఆమె బాడీ పెయింటింగ్ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాకుండా ఎన్నో విమర్శలకు దారితీసింది. అంతేకాదు, ఆమెపై లైంగిక వేధింపుల కేసుతో పాటు, పోక్సో చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం ఆమె కేరళ హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఆమె దరఖాస్తును కొట్టివేసింది. రెహానా తన సిద్ధాంతాల ప్రకారం తన పిల్లలకు లైంగిక విద్యను బోధించవచ్చని, కానీ ఇలా బహిరంగంగా కాకుండా నాలుగు గోడల మధ్యే అది జరగాలని పేర్కొన్న జస్టిస్ వీవీ కున్హికృష్ణన్.. కేసు దర్యాప్తును కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.


More Telugu News