ప్రభుత్వం చేతులెత్తేసింది... ప్రజలే జాగ్రత్త పడాలి: పవన్ కల్యాణ్

  • ఏపీలో కరోనా కల్లోలం
  • నిత్యం వేల సంఖ్యలో కొత్త కేసులు
  • ఏపీ సర్కారు తేలిగ్గా తీసుకుంటోందన్న పవన్
ఏపీలో కరోనా విజృంభిస్తూ, నిత్యం రికార్డు స్థాయిలో కేసులు వెల్లడవుతున్న నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా తీవ్రత ఎలావుందో ప్రధాని నరేంద్ర మోదీ కూడా చెప్పారని, కానీ ఏపీ నాయకత్వం మాత్రం కరోనా ఓ ఫ్లూ వంటిదని చెబుతోందని తెలిపారు. దీన్నిబట్టి ప్రభుత్వం చేతులెత్తేసినట్టు అర్థమవుతోందని, ప్రజలే జాగ్రత్తలు పాటించాలని పవన్ పిలుపునిచ్చారు.

ఆయన ఈ సందర్భంగా కాపు కార్పొరేషన్ అంశంపైనా స్పందించారు. కార్పొరేషన్ నిధులు, సబ్ ప్లాన్ నిధులను నవరత్నాల్లో కలిపేస్తున్నారని ఆరోపించారు. కాపు కార్పొరేషన్ సహా ఇతర కార్పొరేషన్ల నిధులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భగవంతుడు151 సీట్లతో వరం ఇచ్చాడని, కానీ రాజకీయ కక్ష సాధింపు కోసమే వైసీపీ నాయకత్వం పనిచేస్తోందని విమర్శించారు.


More Telugu News