రక్తదానంలో రికార్డులను బద్దలు కొట్టిన టీఆర్ఎస్
- కేటీఆర్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం
- రక్తాన్ని దానం చేసిన సుమారు 2 వేల మంది
- రక్తదానాన్ని సేకరించిన రెడ్ క్రాస్ సొసైటీ
ఒక మనిషి తోటి మనిషిని బతికించడానికి చేసే గొప్ప పనుల్లో రక్తదానం ఒకటి. అందుకే ఎంతో మంది ఈ ఉన్నతమైన కార్యక్రమంలో భాగస్వాములై, స్వచ్ఛందంగా బ్లడ్ డొనేట్ చేస్తుంటారు. సినీ తారల అభిమాన సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా సామూహిక రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ సమాజ సంక్షేమం కోసం పాటుపడుతుంటాయి.
తాజాగా కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని టీఆర్ఎస్ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును ఏర్పాటు చేసింది. హైదరాబాద్ యూసుఫ్ గూడలో ఉన్న కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మొహమ్మద్ అలీ, పువ్వాడ అజయ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా టీఆర్ఎస్ సరికొత్త రికార్డును సృష్టించింది. ఒకే రోజున అత్యధికంగా రక్తదానం చేసిన రికార్డును సాధించింది. గతంలో 867 మంది ఒకే రోజున రక్తదానం చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కారు. ఈరోజు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సుమారుగా 2 వేల మంది రక్తదానం చేసి సరికొత్త ఘనతను సాధించారు. ఈ కార్యక్రమం ద్వారా రెడ్ క్రాస్ సొసైటీ రక్తదానాన్ని సేకరించింది.