నా ముంబై డేట్స్ ను ఆయనే చూసుకుంటారు: ప్రియమణి

  • మాజీ నక్సలైట్ వద్ద శిక్షణ తీసుకోలేదు
  • నాకు మంచి భర్త దొరికాడు
  • లాక్ డౌన్ వల్ల నా భర్తతో మూడు నెలలు గడిపాను
విభిన్నమైన పాత్రలతో సినీ ప్రేక్షకులను అలరించిన ప్రియమణి... పెళ్లైన తర్వాత కూడా ఆఫర్లను చేజిక్కించుకుంటోంది. ఆమె నటించిన 'విరాటపర్వం', 'నారప్ప' చిత్రాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరోవైపు వెబ్ సిరీస్ లలో సైతం ప్రియమణి నటిస్తోంది. హిందీ, కన్నడ చిత్రాలలో కూడా నటించింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, 'విరాటపర్వం' చిత్రంలో భారతక్క పాత్ర కోసం తాను ఎలాంటి హోంవర్క్ చేయలేదని, ఒక మాజీ నక్సలైట్ వద్ద శిక్షణ తీసుకున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పింది. ఒక నక్సలైట్ ఎలా ఉండాలి, వారి వద్ద ఎలాంటి వస్తువులు ఉంటాయి? అనే విషయాలను దర్శకుడే నిర్ణయించాడని తెలిపింది. 'నారప్ప' సినిమాలో కూడా తనది ఒక బలమైన పాత్ర అని చెప్పింది. లాక్ డౌన్ సమయంలో తాను కథలను విన్నానని... వాటి గురించి ఇప్పుడు వివరాలను వెల్లడించలేనని తెలిపింది.

తనకు మంచి భర్త దొరికాడని, కుటుంబ జీవితం పట్ల చాలా సంతోషంగా ఉన్నానని ప్రియమణి చెప్పింది. తన భర్త నుంచి తనకు మంచి సహకారం ఉందని... అందుకే పెళ్లైన మూడో రోజునే మళ్లీ తాను షూటింగ్ కు వెళ్లగలిగానని తెలిపింది. కరోనా లాక్ డౌన్ కారణంగా తన భర్తతో మూడు నెలల సమయం గడిపానని చెప్పింది. తన ముంబై డేట్స్ ను ఆయనే చూసుకుంటారని తెలిపింది.


More Telugu News