విజయవాడలో ఎల్లుండి నుంచి లాక్‌డౌన్ అంటూ ప్రచారం.. అవాస్తవమన్న కలెక్టర్!
- 26 నుంచి వారం రోజులపాటు లాక్‌డౌన్ అంటూ ప్రచారం
- నగరంలో లాక్‌డౌన్ విధించే ఆలోచన లేదన్న కలెక్టర్
- అవాస్తవాలు ప్రచారం చేయొద్దని హితవు
కృష్ణా జిల్లాలో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా విజయవాడలో వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వారం రోజులపాటు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ విధించబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది.
ఈ ప్రచారంపై కలెక్టర్ ఇంతియాజ్ స్పందించారు. 26 నుంచి వారం రోజులపాటు లాక్‌డౌన్ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తి అవాస్తవమని స్పష్టం చేశారు. ఇలాంటి వార్తలతో ప్రజలను అయోమయానికి గురిచేయవద్దని హితవు పలికారు. నగరంలో లాక్‌డౌన్ విధించే ఆలోచనేదీ లేదని తేల్చి చెప్పారు.
కాగా, కృష్ణా జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. జిల్లా వ్యాప్తంగా నిన్న 230 నిర్ధారిత కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,482కు చేరుకుంది. వీరిలో ఇప్పటి వరకు 3,260 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.