మళ్లీ బాక్సింగ్ రింగ్‌లోకి మహాబలుడు.. సెప్టెంబరులో రాయ్‌జోన్స్‌తో టైసన్ ఢీ!

  • 2005లో బాక్సింగ్‌కు గుడ్‌బై చెప్పిన టైసన్
  • పునరాగమనానికి సిద్ధంగా ఉన్నట్టు వీడియో
  • చారిటికీ నిధులు సమకూర్చడం కోసమేనన్న మైక్
మహాబలుడు మైక్ టైసన్ (54) మళ్లీ బాక్సింగ్ రింగ్‌లోకి దూకబోతున్నాడు. 2005లో బాక్సింగ్ నుంచి తప్పుకున్న టైసన్ ఈ ఏడాది సెప్టెంబరు 12న, 4 డివిజన్ చాంపియన్ అయిన అమెరికన్-రష్యన్ ప్రొఫెషనల్ బాక్సర్ రాయ్‌జోన్స్ జూనియర్‌తో రింగును పంచుకోబోతున్నాడు. ఈ సందర్భంగా తన పునరాగమనానికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 20 ఏళ్ల వయసులోనే ప్రపంచ హెవీ వెయిట్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న టైసన్ పునరాగమనంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

టైసన్ పోస్టు చేసిన ఈ వీడియోలో అతడు సాధించిన టైటిళ్లను చూపించాడు. ఓ పంచ్ ఇవ్వగానే ‘హి ఈజ్ బ్యాక్’ అంటూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తుంది. ఈసారి తాను బరిలోకి దిగబోయేది ఓ చారిటీకి నిధులు సమకూర్చడం కోసమేనని టైసన్ పేర్కొన్నాడు. వచ్చేస్తున్నా సిద్ధంగా ఉండండంటూ ప్రత్యర్థులకు టైసన్ సవాలు విసిరాడు.


More Telugu News